మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆర్థిక సమస్యలతో ఇప్పటివరకు 21 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఒక్కో బాధిత ఫ్యామిలీకి రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రైవర్ల కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించాలన్నారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమాన పరిచారని..వెంటనే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన సీఎం రేవంత్ ఇలాంటివి మాట్లాడకూడదని ఆగ్రహించారు. పోడియం చుట్టిముట్టి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు.. అందోళన చేయండంతో సభను 10 నిమిషాల వాయిదా వేశారు కౌన్సిల్ చైర్మన్ గుత్తా.