బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ నోట్ల కట్టలు బయటపడ్డాయన్నారు మంత్రి హరీష్ రావు. కర్ణాటకలో 42 కోట్ల రూపాయలు పట్టుకున్నారు ఐటి అధికారులు. తెలంగాణలోని ఓ ప్రముఖ వ్యక్తి డబ్బులుగా అధికారులు గుర్తించనట్లు సమాచారం. అయితే ఇదే విషయాన్ని హరీష్ రావు కూడా వెల్లడించారు.
బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయన్నారు. ఐటీ దాడుల్లో దొరికిన 40 కోట్లు కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లోనివేనని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ చూస్తుందని… గతంలో కర్ణాటక లో 40 శాతం కమిషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు 50 శాతం కమిషన్ నడుస్తుందన్నారు. అక్కడ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసి తెలంగాణ కి డబ్బులు తరలిస్తున్నారని ఫైర్ అయ్యారు. 1500 కోట్లతో తెలంగాణలో గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లో అభ్యర్థులు కరువు అంటూ చురకలు అంటించారు హరీష్ రావు.