అల్లు అర్జున్‌ వివాదం..రంగంలోకి ట్రబుల్‌ షూటర్‌ ?

-

అల్లు అర్జున్‌ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో..రంగంలోకి ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌ రావు దిగారు. అల్లు అర్జున్‌ను రేవంత్ రెడ్డి పర్సనల్ టార్గెట్ చేస్తున్నాడని ఆగ్రహించారు ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌ రావు. రేవంత్ రెడ్డి అన్న టార్చర్ వల్ల ఒక రైతు సూసైడ్ చేసుకుంటే, ఇప్పటి వరకు దాని పై కనీసం కేసు నమోదు కాలేదని ఫైర్ అయ్యారు.

Harish Rao Reaction On Allu Arjun Issue

తెలంగాణ రాష్ట్రంలో 50 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే, రేవంత్ రెడ్డి కనీసం దాని మీద మాట్లాడలేదని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌ రావు. 500 మంది రైతులు, 80 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రేవంత్ రెడ్డికి మాట్లాడటానికి సమయం లేదు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రం సమయం ఉందన్నారు హరీష్ రావు. కాగా…. ఇవాళ అల్లు అర్జున్‌ ను పోలీసులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news