దేవుళ్లను రేవంత్ రెడ్డి మోసం చేసినందుకే.. భూకంపాలు వస్తున్నాయి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై హరీష్ రావు ఆధ్వర్యంలో ఛార్జ్ షీట్ విడుదల చేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే.. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
మీ ఏడాది పాలన లో ఒక్క చెక్ డ్యామ్ కట్టారా..ప్రతి సంవత్సరం 6 లక్షల ఏకురాలకు ఆయకట్టు ఇస్తా అన్నారు.. ఇచ్చారా..? అంటూ నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం చేసిన వాటికి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభిస్తున్నారని చురకలు అంటించారు. నిజంగా ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డవి అయితే పాలమూరు రంగారెడ్డి లో ఒక్క తట్టేడు మట్టి అయిన తీశారా.. అంటూ ఆగ్రహించారు.
కేసీఆర్ పాలన లో ఇరిగేషన్ పెరిగింది..రేవంత్ పాలన లో ఇర్రిటేషన్ పెరిగిందన్నారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు..అయ్యిందో కాలేదో ప్రజలకు తెలుసని… 4 కోట్ల ప్రజల ను మోసం చేసిన రేవంత్ రెడ్డి..3 కోట్ల దేవతలను మోసం చేయడు అంటూ ఫైర్ అయ్యారు.