తెలంగాణ శాసనసభ చరిత్రలో ఇది చీకటి రోజు : హరీష్ రావు

-

తెలంగాణ శాసనసభ చరిత్రలో ఇది చీకటి రోజు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. క్లారిఫికేషన్ ఇవ్వకుండా సభ వాయిదా వేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేశారా అని అడిగితే సభ వాయిదా వేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన  నోటిఫికేషన్లకు ఉద్యోగాలు ఇచ్చి తామే ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు కట్టామని, రైతు బంధు ఇచ్చామని.. రూ.2వేల పింఛను ఇచ్చామని హరీష్ రావు తెలిపారు. మహిళలకు ఇస్తామన్న వడ్డీ రుణాలు.. రైతు రుణమాఫీ గురించి అడిగితే సభ వాయిదా వేశారని మండిపడ్డారు. లక్ష కోట్ల వడ్డిలేని రుణాలని ఆనాడు ప్రకటించి.. నో ఎల్ఆర్ఎస్ అని చెప్పి.. ఇప్పుడు మాట దాటేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫీజ్ రీంబర్స్మెట్ విషయంలో కూడా స్పందించడం లేదు అని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. అక్కాచెళ్లెళ్లకు ప్రకటించిన హామీలు నెరవేర్చకుండా అందాల పోటీలు పెడుతున్నామంటున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version