మెదక్ పట్టణంలో ఇంటిపై పడిన పిడుగు

-

మండు వేసవిలో తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ సాయంత్రం నుంచి వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వాన పడింది. మరికొన్ని జిల్లాల్లో వడగండ్లు కురిసి రైతులకు కడగండ్లు మిగిల్చాయి. అకాల వర్షాలకు చాలా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

మరోవైపు మెదక్ పట్టణంలోని జంబికుంటలో ఓ ఇంటిపై పిడుగు పడింది. సిద్ధయ్య అనే వ్యక్తి ఇంట్లో పిడుగు పడటంతో సామగ్రి ధ్వంసమైంది. అయితే పిడుగు పడిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మరోవైపు నిజామాబాద్‌ జిల్లాలో ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కురిసిన వానకు వరిధాన్యం నేలరాలింది. మరికొన్ని ప్రాంతాల్లో మామిడి పూత, కాయలు నేలరాలాయి.

వడగండ్ల వానకు కరీంనగర్‌లోని చొప్పదండి మార్కెట్లో మొక్కజొన్న తడిసిపోయింది. మెదక్ పట్టణం,  పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి మామిడికాయలు నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వానొచ్చి తమకు కడగండ్లు మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version