BREAKING : పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

-

ఇటీవల తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. రైలెక్కాలంటే జంకే పరిస్థితులు తీసుకొస్తున్నాయి. తాజాగా మరో రైలు ప్రమాదం జరగడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలంలోని మక్కాజిపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్న పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు.

బెంగళూరు నుంచి ధర్మవరం వెళ్తున్న గూడ్స్ రైలు మక్కాజిపల్లి రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ చేంజింగ్ పాయింట్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనతో ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.  రైలు పట్టాల సామగ్రి దించేసి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version