తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు, నీటియుద్ధాలు లేవని తెలంగానలో మార్పు తీసుకువచ్చామని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ కంటే ముందు 60 ఏండ్లలో 3 వైద్య కళాశాలలు ఉంటే ఇప్పుడు 33 మెడికల్ కాలేజీలు పెట్టామని ఆయన అన్నారు. వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు. తెలంగాణ ఇప్పుడు వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం ఉందని.. భూముల ధరలు పెరిగాయని ఆయన అన్నారు. ఒక్కపుడు మన రాష్ట్రుంలో గుంటూరు పల్లెలు ఉండేవి…. ఆంధ్రప్రదేశ్ లో భూముల ధరలు ఎక్కువ ఉండేవి ఒక ఎకరా అక్కడ అమ్మితే ఇక్కడ ఐదు ఎకరాలు వచ్చేవి. అక్కడి వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోని స్థిర పడ్డారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయిందని… ఇక్కడ ఒక ఎకరా అమ్మితే ఆంధ్రాలో ఐదు ఎకరాలు వస్తుందని హరీష్ రావు అన్నారు. చదువులపైన సీరియస్ నెస్ ఉండాలని.. బయటకు వెళ్తే సమాజం గూర్చి అవగాహన జ్ఞానం పెరుగుతుందని హరీష్ రావు సూచించారు. సమయం చాలా విలువైందని పోయిన కాలం తిరిగి రాదని ఆయన అన్నారు.