మిస్టర్‌ రేవంత్‌… యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేయకు : హరీష్ రావు

-

రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేసి మాట్లాడటాన్ని ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరం అంటూ చురకలు అంటించారు మాజీ మంత్రి హరీష్ రావు. యూట్యూబ్‌ను నమ్ముకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నావని మండిపడ్డారు.

harish rao warns cm revanth over you tube channels

ఓడ దాటెదాక ఓడ మల్లన్న.. ఓడ దాటినంక బోడ మల్లన్న అన్న చందంగా రేవంత్ తీరు ఉందని సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి హరీష్ రావు. నీ అక్రమాలను, నీ అవినీతిని, నీ డొల్లతనాన్ని, నువ్వు మాట తప్పిన తీరును, ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానెళ్ళు ఎండగడుతున్నాయని అక్కసు వెళ్లగక్కుతున్నవు అంటూ ఆగ్రహించారు మాజీ మంత్రి హరీష్ రావు. బిడ్డా.. నిన్ను గద్దె దించడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానెళ్ళు ఒక్కటైతాయని వార్నింగ్‌ ఇచ్చారు. నీ భండారాన్ని బయట పెడుతాయి జాగ్రత్త అని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version