ప్రకాశం బ్యారేజ్ పై కుట్రలు చేసింది.. లోకేష్‌ సన్నిహితులే – అంబటి రాంబాబు

-

ప్రకాశం బ్యారేజ్ పై కుట్రలు చేసింది.. లోకేష్‌ సన్నిహితులు, టీడీపీకి చెందిన వారనని ఆరోపణలు చేశారు అంబటి రాంబాబు. బుడమేరు, కృష్ణానది వరదలను వైసీపీ నేతలపై కక్ష తీర్చుకోవటానికి చంద్రబాబు ఉపయోగించటం దురదృష్టకరమని ఆగ్రహించారు. ప్రకాశం బ్యారేజ్ ను 3 బోట్లు ఢీకొన్న ఘటనకు వైసీపీ కుట్ర కారణమని చంద్రబాబు అపవాదు వేస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ నేతలపై కేసులు పెట్టీ ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో లేనంత వరద వల్ల ఎగువ నుంచి ప్రవాహం తో వందల బోట్లు కొట్టుకు వచ్చాయని తెలిపారు. దిగువకు చిన్న బోట్లు బ్యారేజ్ నుంచి కిందకి కొట్టుకు పోతే పెద్దగా ఉన్న 3 బోట్లు మాత్రం బ్యారేజ్ దగ్గర చిక్కుకు పోయాయని పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేసిన కొమటి రాము టీడీపీ ఎన్నారై విభాగానికి చెందిన కోమటి జయరాం బంధువు అన్నారు. లోకేష్ తో ఫోటో దిగిన ఉషాద్రి కూడా వైసీపీ నేతగా చెబుతున్నారని ఆగ్రహించారు. నందిగామ సురేష్, తలశిల రఘురాం మీద మళ్ళీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు…జగన్ కు సన్నిహితంగా ఉండే వారిని అరెస్ట్ చేయాలని చంద్రబాబు చేసే చౌక బారు ఎత్తుగడలతో మీరే భ్రష్టు పడతారని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version