టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగస్టు 10, 2014న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు సకల జనుల సర్వే రిపోర్టు ఎక్కడ కేసీఆర్, కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. గాంధీ భవన్ లో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల కులగణన తరువాతనే స్థానిక ఎన్నికలు జరగాలన్నారు.
కోర్టు కూడా అన్నది. కుల గణన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారని.. మూడు నెలలలోపు రిపోర్టు రావాలన్నది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కూడా బీసీ కుల గణనకు పూర్తి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రతీ గ్రామంలో సకల జనుల సర్వే చేసిందని.. ఇప్పటివరకు రిపోర్టును మాత్రం బయట పెట్టలేదని ఆరోపించారు. ఆ రిపోర్టులు ఎక్కడికీ పోయాయంటూ ఆయన కేటీఆర్, కేసీఆర్ లను ప్రశ్నించారు. ఇప్పటికైనా కంప్లీట్ డేటాను సీఎస్ కు అందజేయాలని.. ఆ రిపోర్టు ఇస్తే.. బీసీ కులగణనను ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రూ.150 కోట్లు విడుదల చేస్తే.. కేవలం రెండు నెలల్లోనే బీసీ కులగణన రిపోర్టు వస్తుందని తెలిపారు వీ.హెచ్.