సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ..!

-

కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ పథకంలో జరుగుతున్న పొరపాట్ల కారణంగా పేద ప్రజలకు అన్యాయం జరుగుతున్నదని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రేషన్‌ కార్డులో పేరున్న వారు రెండు మూడు కుటుంబాలుగా విడిపోయి బతుకుతున్నారని.. వారందర్నీ ఒకే కుటుంబంగా లెక్కకట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణ రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ఎలాంటి బిల్లు వసూలు చేయవద్దనే ప్రభుత్వ పథకంలో జరుగుతున్న పొరపాటు వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. కేవలం 200 యూనిట్ల వరకు వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్లు ఇస్తున్నారు. కానీ ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా సరే, మొత్తం 201 యూనిట్లకు బిల్లు వసూలు చేస్తున్నారు. వినియోగదారులు ప్రతీ రోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాం? మీటర్ ఎంత తిరుగుతుంది? అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు. తానివ్వాల ఫ్యాన్ వేసుకోవాలా? వద్దా? లైట్ వేసుకోవాలా? వద్దా? అనేది మీటర్ రీడింగ్ చూసి నిర్ణయించుకోవాల్సిన దుస్థితికి పేదలను నెట్టడం బాధాకరం. కాబట్టి 200 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడినప్పటికీ, పై యూనిట్లకు మాత్రమే బిల్లు వేసే విధంగా నిబంధనలు రూపొందించాలని కోరుతున్నాను.

Read more RELATED
Recommended to you

Exit mobile version