పేషెంట్ కేర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాలు..!

-

పేషెంట్ కేర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా ఆదేశాలు జారీ చేసారు. ఇవ్వాళ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో మంత్రి సమీక్ష సమావేశంలో డైట్, సానిటేషన్ సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల పనితీరు, సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా అధికారులను ఆదేశించారు. సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలన్నారు. హాస్పిటళ్ల సూపరింటెండెంట్లతో పాటు, డీఎంఈ, డీహెచ్, వీవీపీ కమిషనర్ కూడా తమ పరిధిలోని హాస్పిటళ్లలో పని చేస్తున్న వారి బయోమెట్రిక్ అటెండెన్స్‌ను మానిటర్ చేయాలన్నారు. పేషెంట్లతో ఎలా మాట్లాడాలో కింది స్థాయి సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు మంత్రి దామోదర రాజ నర్సింహా.‌

Read more RELATED
Recommended to you

Exit mobile version