మూసీ అభివృద్ధి.. 16 వేల 2BHK ఇళ్లను కేటాయించిన ప్రభుత్వం..!

-

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధి లో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల 2BHK గృహాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాల కు పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్ మరియు మేడ్చల్‌.. మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రేపు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేస్తారు.

ముందుగా రివర్ బెడ్ లో ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. అక్కడ ఉన్న వారిని తరలిస్తారు. మూసీ బఫర్ జోన్ లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తారు. నిర్మాణ ఖర్చు తో పాటు, వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. 2 BHK ఇల్లు కూడా కేటాయిస్తారు. మూసీ బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే భరోసా ఇచ్చారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. నిర్వాసితుల ను సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియను కలెక్టర్లు రేపు ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version