సూళ్లూరుపేట టిడిపిలో రాజకీయ సెగలు రేగుతున్నాయి.. పార్టీకి విధేయులుగా ఉన్న మాజీ మంత్రి పరసా వెంకటరత్నానికి కాదని.. నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తెకు టికెట్ కేటాయించడంపై ఆయన వర్గం అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పరస వెంకటరత్నం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న అతన్ని చంద్రబాబు కావాలనే దూరం పెట్టేశారనే ప్రచారం ఆపార్టీలో జరుగుతోంది..
మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.. మాజీ మంత్రి పరసారత్నంతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.. పరసరత్నం ఓడిపోవడంతో.. టిడిపి పెద్దలకు అయన దగ్గరై నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అడిగారని అప్పట్లోనే పార్టీలో గుసగుసలు వినిపించాయి. ఈ విషయం తెలుసుకున్న పరసారత్నం నెలవల సుబ్రహ్మణ్యంని దూరం పెట్టారట అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తనకు మరోసారి టిక్కెట్ ఇవ్వాలంటూ పరసారత్నం చంద్రబాబునాయుడు అభ్యర్థించారు.. తనకు అవకాశం లేకపోతే తన అల్లుడు శరత్ చంద్రకైన టిక్కెట్ ఇవ్వాలని ఈసారి కచ్చితంగా గెలిచి తీరుతానని ఆయన చెప్పుకుచ్చారట.. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సీనియర్ గా ఉన్న పరసా రత్నాన్ని పక్కన పెట్టేయాలని నిర్ణయానికి వచ్చారని.. అందుకే ఆయన మాటలు ఏమీ పరిగణలోకి తీసుకోకుండా నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయ్ శ్రీ కి టికెట్ కేటాయించాలని పార్టీ నేతలు చెబుతున్నారు..
పార్టీలో సీనియర్ నేతగా ఉన్న తనకు కాదని విజయ్ శ్రీ కి టికెట్ కేటాయించడంపై పరసారత్నం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. నియోజకవర్గంలో తనను కాదని టిడిపి అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తామంటూ అనుచరుల వద్ద చెప్పుకొస్తున్నారట.. టిడిపి అధినేత చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారని.. సూళ్లురుపేట నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి ఓడిపోవడం ఖాయం అనే ప్రచారం నియోజకవర్గంలో జరుగుతుంది..