మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్..!

-

25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్ అంటున్నారు.. ఫిరాయింపులను ప్రోత్సహించబోమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నారని సెటైర్ వేశారు.

ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదని హరీష్ రావు జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పవర్లోకి వచ్చాక కాంగ్రెస్కు వడ్డీతో సహా మీకు తిరిగిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలో వస్తుందని.. కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version