HMPV వైరస్‌ పై తెలంగాణ సర్కార్‌ కీలక ప్రకటన…ఇది కొత్తది కాదు!

-

HMPV వైరస్‌ పై తెలంగాణ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. ఇది కొత్తది కాదంటూ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ క్లారిటీ ఇచ్చారు. Human MetaPneumoVirus (HMPV) అనేది కొత్త వైరస్ కాదు..2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని వెల్లడించారు. నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని… ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు.

Health Minister Damodara Rajanarsimha on hmpv

వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందని… చైనాలో ఈ సంవత్సరం HMPV కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలుస్తోందని వివరించారు. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని..ప్రకటించారు.

కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో, మన రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు రెగ్యులర్‌‌గా కోఆర్డినేట్ చేసుకుంటున్నారన్నారు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని… రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందని వివరించారు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.

Read more RELATED
Recommended to you

Latest news