HMPV వైరస్ పై ఆందోళన వద్దు అన్నారు సీఎం చంద్రబాబు. హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు… రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు. అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలును తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ పై హెల్త్ డిపార్ట్మెంట్ కు దిశా నిర్దేశం చేశారు. బెంగళూరు, గుజరాత్ ల్లో బయటపడ్డ వైరస్ పై ప్రభుత్వం దృష్టి పెట్టారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు పెట్టుకోవాలని సూచనలు చేశారు. చికిత్స కోసం అవసరమైన ఔషధాల లభ్యత పై సమీక్ష నిర్వహించారు. HMPV అనేది సాధారణ కాలానుగుణ వ్యాధి, తేలికపాటి స్వభావం కలదని… ఈ వైరస్ పై భయపడాల్సిన అవసరం లేదన్నారు. 2001 నుంచి HMPV ప్రబలంగా ఉన్నా, మరణాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…వివరించారు.