ఆగస్టు 1 నుంచి క్షేత్రస్థాయలో BJP ఉద్యమాలు

-

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ అహంకార, అవినీతి, అక్రమ పాలనకు చరమగీతం పాడేందుకు.. తెలంగాణ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రిజి.కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. శుక్రవారం సాయంత్రం జరిగిన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో కీలకాంశాలపై చర్చించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేయాలని నిర్ణయించారు.

ఆగస్టు 1 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమాలు ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బీజేపీ కు మద్దతుగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు. ముఖ్యనేతలు ఎవరొచ్చినా.. దళితవాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీఆర్ఎస్ సర్కారు వారికి చేసిన మోసాన్ని తెలియజేసేలా చైతన్యం తీసుకురావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. బీజేపీ మాత్రమే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించగలదనే.. విశ్వాసం ప్రజల్లో బలంగా ఉందని.. దీన్నిసద్వినియోగం చేసుకుంటూ.. అవినీతి, అక్రమ, కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version