Heavy police deployment at Telangana Bhavan: తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది.. దీంతో తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఫార్ములా-ఈ కార్ రేసులో నేడు ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు కేటీఆర్. ఇందులో భాగంగానే… కాసేపట్లో ఏసీబీ ఆఫీస్‌కు మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు.. రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ నుంచి ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరిన కేటీఆర్…ఫార్ములా-ఈ కార్ రేసులో విచారణకు హాజరు కానున్నారు.
ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లే కంటే… ముందు.. తెలంగాణ భవన్ కు కేటీఆర్ రానున్నారట. దీంతో తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది.. అయితే…. ఏసీబీ విచారణకు KTR హాజరవుతున్న నేపథ్యంలో BRS నేతల ముందస్తు అరెస్ట్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే… ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా 100 మంది బీఆర్‌ఎస్ నేతల ముందస్తు హౌస్ అరెస్ట్ అయ్యారు. అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందోబస్తు చర్యలకు సిద్దమవుతున్నారు పోలీసులు.