హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. ఈరోజు(సోమవారం) నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, నిన్న(ఆదివారం) రాత్రి ముషీరాబాద్, ఆసిఫ్‌నగర్, షేక్‌పేట్, అంబర్‌పేట్, బహదూర్‌పురా, సైదాబాద్, బండ్లగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు.. చెట్లను తొలగిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ సాయంత్రం 6 గంటల తరువాత పలు జిల్లాల్లో భారీ వర్షం ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని…50-60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడవచ్చని తెలిపింది ఐఎండీ.