చల్లబడ్డ భాగ్యనగరం.. హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

-

గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో విలవిలలాడుతున్న హైదరాబాద్‌ ఒక్కసారిగా చల్లబడింది. ఎండలతో అల్లాడుతున్న నగరవాసులను వరుణుడు పలకరించాడు. ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాన పడటంతో నగర వాతావరణం చల్లబడింది. వాన కురవడంతో నగరప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

నగరంలోని హిమయత్‌నగర్‌, కోఠి, అమీర్‌పేట, బోరబండ, జూబ్లీహిల్స్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, మేడ్చల్‌, విద్యానగర్‌, కోఠి, అబిడ్స్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. పలు చోట్ల రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఖైరతాబాద్‌లోని మెర్క్యురీ హోటల్‌ వద్ద ఓ కారుపై చెట్టు కూలింది. అయితే ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు.

తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news