ట్రంప్ సుంకాలు.. ఏం చేస్తారంటూ కేంద్రానికి రాహుల్ ప్రశ్న

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ దిగుమతులపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ టారిఫ్ లపై తాజాగా ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం స్పందన తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో గురువారం రోజున మాట్లాడిన రాహుల్ గాంధీ ట్రంప్ సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధించిన సుంకాలు మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయని..  దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

మరోవైపు చైనా భారత్‌కు చెందిన 4 వేల కి.మీ. పైగా భూభాగాన్ని ఆక్రమించిందని.. దీనిపై రాష్ట్రపతి, ప్రధాని బీజింగ్‌ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసిందని అన్నారు. దాన్ని తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ.. ఎవరి హయాంలో చైనా ఈ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుందో అందరికీ తెలుసని అన్నారు. డోక్లాపై ప్రతిష్ఠంభన జరుగుతున్న సమయంలో బీజింగ్ అధికారులతో కలిసి సూప్‌ ఎవరు తాగారో తెలుసని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news