గ్రేటర్ హైదరాబాద్ లో అతి భారీ వర్షం నమోదు.. మియాపూర్‌లో 14.7 సెంటీమీటర్లు

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం నమోదు అయింది. మియాపూర్‌లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. కూకట్‌పల్లిలో 14.3, శివరాంపల్లిలో 13, గాజుల రామారంలో 12.5, బోరబండలో 12.5, జీడిమెట్లలో 12.1, షాపూర్, మూసాపేట్, జూబ్లీ హిల్స్ లో 12, కుత్బుల్లాపూర్ లో 11.5, మాదాపూర్ లో 11.4, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ లో 11.2, బేగంపేట్, కేపీహెచ్‌బీ, అల్వాల్, శేలింగంపల్లిలో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.

Red alert issued in Hyderabad

ఇక అటు హైదరాబాద్ హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జలమండలి అధికారులు. ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 442 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఈ తరుణంలోనే తెలంగాణ పోలీసులు కీలక ప్రకటన చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు ఇంటి నుండి బయటకు రాకూడదన్నారు. ఐటీ ఉద్యోగులు Work From Home చేసుకోవాలి.. అత్యవసర ఉద్యోగులు ఆఫీస్ నుండి ఇంటికి వర్షాభావపరిస్థితిని బట్టి బయల్దేరాలని కోరారు తెలంగాణ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version