సౌత్ ఆఫ్రికాను వైట్ వాష్ చేసి చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ మహిళలు !

-

ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మూడు టీ 20 ల సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లలోనూ సౌత్ ఆఫ్రికా ను చిత్తు గా ఓడించి వైట్ వాష్ చేసింది. గత రాత్రి కరాచీ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఛేజింగ్ చేయడానికి మొగ్గు చూపింది. బదులుగా పాకిస్తాన్ మహిళలు నిర్ణీత ఓవర్ లలో అయిదు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. బిస్మత్ మరూప్ పరుగులతో ఆకట్టుకోగా ఆఖరిలో నిదా దర్ ధనా ధన్ ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో శేఖుఖునే రెండు వికెట్లు తీసుకుంది. ఇక పరుగుల లక్ష్యంతో ఛేదనను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 19 వ ఓవర్ వరకు ఫేవరెట్ గా ఉంది. కానీ లారా వోల్వట్ అవుట్ అవగానే సీన్ మొత్తం మారిపోయింది. కెప్టెన్ గా వోల్వర్ట్ మొదటి నుండి ఆడుతూ వచ్చింది.. ఈమె కేవలం 54 బంతుల్లోనే 72 పరుగులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది.

పాకిస్తాన్ పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 3 – 0 తో కైవసం చేసుకుంది. ఇక పాక్ బౌలర్లలో సందు మరియు ఇక్బల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ ఫలితం తో పాకిస్తాన్ టీ 20 చరిత్రలో సౌత్ ఆఫ్రికా పై వైట్ వాష్ చేయడం ఇదే మొదటిసారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version