గత కొన్ని రోజులుగా ఎడతేరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం తడిసి ముద్దైపోయింది. ఒక పక్క కరోనా, మరో పక్క భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఇబ్బందులు మరికొన్ని రోజులు తప్పవని తెలుస్తుంది. ఈశాన్య బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇది తీవ్ర అల్పపీడనంగా మారి గురువారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు.