తెలంగాణకు 5 రోజుల పాటు భారీ వర్షాలు…ఎల్లో అలర్ట్ జారీ

-

Heavy rains for 5 days in Telangana: తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, వరంగల్, నిజామాబాద్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Heavy rains for 5 days in Telangana yellow alert issued

ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికతో వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జీహెచ్ ఎంసీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం రోజున ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో 6.2 సెంటీమీటర్లు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.1, పాల్వంచ మండలం సీతారాంపట్నంలో 5.2, జయశంకర్‌ జిల్లా చిట్యాలలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version