శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా చెప్పుకొనే సలేశ్వరం జాతరకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారిలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సలేశ్వరం వెళ్లే వాహనదారులు మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద టోల్ ఫీజు చెల్లించే క్రమంలో ఆలస్యం అవుతోంది.

దాదాపు ఆరు కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. మన్ననూర్ నుంచి సిద్ధాపూర్ వరకు రద్దీ నెలకొంది.
- శ్రీశైలం ఘాట్‌రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్
- సలేశ్వరం జాతరకు పోటెత్తిన భక్తులు
- వరుస సెలవులతో సలేశ్వరం, శ్రీశైలం వస్తున్న భక్తులతో రద్దీ వాతావరణం
- మన్ననూర్ చెక్‌పోస్ట్ నుంచి సిద్ధాపూర్ వరకు ట్రాఫిక్ జామ్
- శ్రీశైలం ఘాట్‌రోడ్డుపై 6 కి.మీ మేర నిలిచిన వాహనాలు
- ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఇబ్బందులు పడిన పోలీసులు