కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని తెలపారు పవన్. తన కొడుకు ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.

ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఇక అటు మార్క్ శంకర్ ఆరోగ్యంపై బిగ్ అప్డేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడన్నారు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడని చెప్పారు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడని వెల్లడించారు.