ఈ లక్షణాలు ఉండే వ్యక్తులను ఎదుర్కొంటే జాగ్రత్తపడాల్సిందే..!

-

జీవితంలో ఆధ్యాత్మికత, నైతికత మరియు ఆదర్శ జీవితం గురించి ఎన్ని విషయాలను నేర్చుకున్నా తక్కువే అని చెప్పవచ్చు. అయితే ఇటువంటి విషయాల గురించి మరింత తెలుసుకోవాలంటే ఖచ్చితంగా విదురనీతిలో చెప్పిన అంశాలను తెలుసుకోవాల్సిందే. విదురుడు మంచితనం, నీతి, నిజాయితీ వంటి మొదలైన మంచి లక్షణాలు నేటి యువతకు ఎంతో సహాయం చేస్తాయి. విదురనీతిలో చెప్పిన విషయాలను పాటించడం వలన జీవితంలో ఎంతో మార్పుని పొందుతారు. అయితే విదురనీతి ప్రకారం ఈ లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు.

జీవితంలో ఎప్పుడూ కోపంగా ఉండేటువంటి వ్యక్తులతో తక్కువ మాట్లాడటం మేలు. ఎందుకంటే ఎటువంటి కారణం లేకుండా ప్రతి విషయంలో కోపంగా ఉండడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే వారిని మూర్ఖులు అని విదురుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎటువంటి సందర్భంలో అయినా తప్పు జరిగినప్పుడు ఎంతో సులభంగా కోపాన్ని ఇతరుల పై చూపిస్తారు. దీంతో మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక కోపం ఎక్కువ ఉండేటువంటి వారితో తక్కువ మాట్లాడాలి. ఎప్పుడైనా జీవితంలో నష్టపోకుండా ఉండాలంటే నిజమైన స్నేహితులు లేని వ్యక్తుల నుండి ఎంతో దూరంగా ఉండాలి.

నిజమైన స్నేహితులు లేని వ్యక్తులు స్వార్థపరులు. ఎందుకంటే భవిష్యత్తులో మీతో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అటువంటి వారు మూర్ఖుడితో సమానం అని విదురనీతిలో చెప్పడం జరిగింది. కనుక ఇటువంటి వారితో స్నేహం చేయకపోవడమే మేలు. కొంతమంది తప్పు చేస్తూ ఉన్నా సరే ఇతరుల తప్పులను మాత్రమే ఎత్తిచూపుతారు. అటువంటి వారు కూడా మూర్ఖులే. ఇతరులు చేసే పనుల్లో తప్పులు వెతకడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా సంతోషంగా కూడా ఉండలేరు, కనుక అటువంటి వారికి దూరంగా ఉండాలి అని విదురనీతిలో చెప్పడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news