ఉప్పల్లో బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తానని ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేయడం కారణంగా జనాలు అధికంగా అక్కడకు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా జనం ఎగబడినట్లు తెలుస్తోంది. ల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి బట్టతల మీద షాంపూ, ఆయిల్ వేసి వెంట్రుకలు వస్తాయని ఒక్కొక్కరి దగ్గర రూ.700 వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
వీరు ఉప్పల్ భగాయత్లోని శిల్పారామం వద్ద స్టాల్ ఏర్పాటు చేయగా..జనం తాకిడి అధికం అయ్యింది. దీంతో ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.విషయం తెలుసుకున్న ఉప్పల్ పోలీసులు..పర్మిషన్ లేకుండా స్టాల్ ఏర్పాటు చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఉప్పల్లో బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తానని ఇన్స్టాగ్రామ్లో ప్రచారం.. ఎగబడ్డ జనం
ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి బట్టతల మీద షాంపూ, ఆయిల్ వేసి వెంట్రుకలు వస్తాయని ఒక్కొక్కరి దగ్గర రూ.700 వసూలు
ఉప్పల్ భగయత్లోని శిల్పారామం వద్ద స్టాల్ ఏర్పాటు
భారీగా చేరుకున్న జనం… pic.twitter.com/s5SFLRTOGx
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2025