పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. దేవదాయ భూముల వివాదంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దేవదాయ భూములను తన పేరిట మార్చుకున్నారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై పిటిషన్ దాఖలు అయింది. పెద్దపల్లి జిల్లా పాలితం లోని శ్రీ రంగనాయక స్వామి భూములను అక్రమంగా తన పేరిట పట్టా చేసుకున్నారని పిటిషన్ దాఖలు అయింది.
రెవెన్యూ రికార్డుల నుంచి దాసరి మనోహర్ రెడ్డి, ఆయన బంధువుల పేర్లు తొలగించాలని పిటిషన్ వేశారు. రికార్డుల్లో దేవాదాయభూములుగా పునరుద్ధరించాలని కోరారు పిటిషనర్. అయితే.. పెద్దపల్లికి చెందిన రాజేష్ పటేల్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఆయన బంధువులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 31కీ వాయిదా వేసింది.