ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు… ఇవే మార్గదర్శకాలు !

-

సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 3 లక్షల ఆర్థిక సాయం కి నిబంధనలు ఖరారు అయ్యాయి. ఇలా నిర్మాణం చేసుకునేందుకు లబ్ధిదారుల అర్హతలు, ప్రామాణికాలు, అనర్హతలు ఇలా పలు అంశాలపై భారీ కసరత్తు చేసిన అధికార యంత్రాంగం నిబంధనలను రూపొందించింది. ఈ నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరగనున్న క్యాబినెట్ బేటిలో ఈ పథకంపై చర్చించనున్నారు.

ఇవే మార్గదర్శకాలు

సొంత స్థలం ఉండి తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలే అర్హులు.

విడతల వారీగా మొత్తం రూ. 3 లక్షల సాయాన్ని అందజేస్తారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరగని గ్రామాలకు తొలి ప్రాధాన్యం.

ఇంటి నిర్మాణానికి కనిష్టంగా 75 గజాల స్థలం ఉండాలి.

మహిళ పేరిటే ఈ సాయాన్ని అందిస్తారు.

తహసిల్దార్, ఎంపీడీవోలు లబ్ధిదారులను గుర్తిస్తే కలెక్టర్ ఆమోదిస్తారు. అయితే, ఎమ్మెల్యేలు, మంత్రుల పరిశీలన తర్వాతే ఎంపిక జరుగుతుంది.

గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన వారు ఈ పథకానికి అనర్హులు.

అనర్హులను ఏరి వేసేందుకు, ఇప్పటికే ఆన్లైన్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version