బాలికపై హోంగార్డు దారుణం.. !

Join Our Community
follow manalokam on social media

హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై హోంగార్డ్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మభ్యపెట్టి ఓ బాలిక పై హోంగార్డు అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించారు. దీంతో అతని మీద తుకారాంగేట్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే అడ్డగుట్టలో నివాసముండే బి.మల్లికార్జున(40) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన హైదరాబాద్‌ సీసీఎస్‌ లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

rape
rape

అయితే అతనికి పరిచయమైన బాలిక(16) మీద కొద్ది రోజుల కిందట అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని ఆమెను భయపెట్టాడు. బాలికకు రెండు రోజుల కిందట ఆరోగ్యం సరిగా లేక పోవడంతో తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. దీంతో వారు పోలీసులకి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు హోంగార్డును  అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అతనిని అరెస్టు చేసి  రిమాండుకు తరలించారు.

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...