తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ ఓ వివాదంలో చిక్కు కున్నారు. తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ తన గన్ మెన్ పై చేయి చేసుకున్నారు. తలసాని పుట్టినరోజు వేడుకలకు హాజరైన మహమూద్ ఆలీ… బొకే ఎక్కడ అంటూ గన్ మెన్ పై అగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో సహనం కోల్పోయి గన్ మెన్ చెంప చెల్లుమనిపించారు.
దీంతో షాక్ అయిన సదరు గన్మెన్ మంత్రిని అలాగే చూస్తుండి పోయారు. ఆపై వెనుక ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి బొకే తీసుకుని మంత్రకి అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హోం మంత్రి మహమూద్ ఆలీ తీరుపై నేటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే.. వీడియో వైరల్ కావడంతో…. తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ పై విమర్శలు వస్తున్నాయి.
https://x.com/Hema_Journo/status/1710200371032051770?s=20