ఆర్టీసీ కార్మికులపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోంది : పొన్నం

-

శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీపై వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు? ఆర్టీసీని ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారు? అని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఆదరబాదరాగా ప్రభుత్వంలో విలీనం చేశారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు తాము చెల్లించామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.

‘ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత. ఆర్టీసీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇప్పటికే రూ.2 వేల కోట్లు ఇచ్చాం. ఆర్టీసీని పూర్తిగా చంపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. ఆర్టీసీ అంశాన్ని భారాస రాజకీయం చేస్తోంది. యూనియన్లు రద్దు చేసి ఇప్పుడు పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినా గతంలో పట్టించుకోలేదు. ఆర్టీసీ సొమ్మును గత ప్రభుత్వం వాడుకుంది.’ అని మంత్రి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version