తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ఆర్టీసీ పై వాడి వేడీగా చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలోనే ఆర్టీసీ అంశం పై సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ అంశంపై మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్ రావు గతంలో ఆర్టీసీ కార్మిక గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ పదవీ నుంచి ఆయనను తప్పించలేక ఏకంగా బీఆర్ఎస్ కార్మిక సంఘాలనే రద్దు చేసిందని గుర్తు చేసారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రస్తుతం ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో ఉందన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు సభ యొక్క నియమ, నిబంధనలు ఫాలో కావాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావుకు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వడం హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేయగా..సీఎం రేవంత్ రెడ్డి తప్పు బట్టారు. సీపీఐ కి అవకాశం ఇవ్వడాన్ని ప్రశ్నించడం హరీశ్ రావు కు సరికాదని హితవు పలికారు.