ఇన్కమ్ టాక్స్ రిఫండ్ స్టేటస్ ఆన్లైన్లో ఇలా ఈజీగా చెక్ చేసుకోండి?

-

మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనట్లయితే, ఈ వార్త ఖచ్చితంగా తెలుసుకోండి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు చివరి గడువు జూలై 31. కాబట్టి మీరు ఈ పని చేయడానికి మీకు కేవలం 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందువల్ల మీరు ఇంకా ఐటీఆర్‌ ఫైల్ చేయకపోతే, వీలైనంత త్వరగా చేయండి. ఎందుకంటే ఈసారి ఈ గడువును పొడిగించే ఆలోచనలో ఆదాయపు పన్ను శాఖ లేనే లేదు. జూలై 31 వ తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసేవారు పెనాల్టీగా ఖచ్చితంగా భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. జూలై 31 వ తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే మీరు ఎంత జరిమానా చెల్లించాల్సి ఉంటుందో తెలుసా?

పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ కనుక ఉంటే ఆలస్యమైన రిటర్న్ ఫైల్‌పై అతను రూ.1000 జరిమానాని చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ కనుక ఉంటే, అతను రూ. 5,000 జరిమానాని చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఇది కాకుండా పన్ను చెల్లింపుదారు తన పన్ను మొత్తంపై వడ్డీని కూడా చెల్లించాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడే మీ ITR స్టేటస్ ని చెక్ చేసుకోండి.

ఇన్కమ్ టాక్స్ రిఫండ్ స్టేటస్ ఆన్లైన్లో ఈ విధంగా ఈజీగా చెక్ చేసుకోవచ్చు..ముందుగా మీరు ఇన్కమ్ టాక్స్ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ అయిన incometax.gov.in/iec/foportal లోకి వెళ్ళండి. OTPలను రిసీవ్ చేసుకోడానికి మీకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో పాటు పాన్ మరియు ఆధార్ వివరాలు అవసరం. తరువాత PAN వివరాలు, OTP ఇంకా Captcha ఎంటర్ చేసి అకౌంట్లో లాగిన్ అవ్వండి. ఇక లాగిన్ అయ్యాక ఇ-ఫైల్ ఎంపికపై క్లిక్ చేయండి. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ట్యాబ్ లోకి వెళ్లి వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

తరువాత అక్కడ నుండి తాజాగా ఫైల్ చేసిన ITR స్టేటస్ ని చేసుకోవచ్చు. తరువాత మీ ఇన్కమ్ టాక్స్ రీఫండ్ స్టేటస్ ని కూడా చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా మీరు ఇన్కమ్ టాక్స్ రిఫండ్ స్టేటస్ ని ఆన్లైన్లో ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇక ITR ఫారమ్‌లు వివిధ టాక్స్ ఫైలర్‌ల కోసం ఏడు వేర్వేరు రకాలుగా వస్తాయి. కాబట్టి, 2024 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను పూర్తి చేస్తున్నప్పుడు, సంబంధిత ఫారమ్‌ను తప్పనిసరిగా ఎంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version