తెలంగాణలో పోలీసుల తనిఖీలు ముమ్మరం.. ఇప్పటివరకు రూ.243.76 కోట్ల సొత్తు స్వాధీనం

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలన్న ఈసీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చెక్​పోస్టులు ఏర్పాటు చేసి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి, గంజాయి, మద్యం పట్టుబడుతున్నాయి.

ఇప్పటి వరకు పోలీసులు 243.76 కోట్లకు పైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా మెుత్తంగా 103 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకోగా.. ఈ సారి కేవలం 10 రోజుల్లోనే అంతకు రెట్టింపునకు పైగా సొత్తును సీజ్ చేశారు. కేవలం గురువారం ఒక్కరోజే ఏకంగా 83 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112 క్యారట్ల వజ్రాలు, ఆభరణాలు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 24 గంటల్లో 7లక్షల 91వేల 720 నగదును సీజ్ చేసినట్లు…… హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ వెల్లడించారు.

మరోవైపు తనిఖీల్లో ప్రజల నుంచి పెద్దమొత్తంలో నగదు, బంగారం స్వాధీనాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తనిఖీల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం..  ప్రతి జిల్లాలో రెవెన్యూ, ఖజానా, ఆదాయపుపన్ను అధికారులతో గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు చేసి.. బాధితులు సరైన అధారాలు సమర్పించి తిరిగి తమ సొమ్మును స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news