లండన్ లో “దేశ్ కి నేత కెసిఆర్” అంటూ భారీ కటౌట్లు !

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. రేపు జాతీయ పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తోంది. ఇక తాజాగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. దేశ రాజకీయాల్లోకి రావాలని , వారి నూతన జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు యూకే ఎన్నారైలు తెలిపారు.

చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద సమావేశమైన ఎన్నారైలు కెసిఆర్ గారికి మద్దతుగా నినాదాలు చేశారు. యూకే లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు సైతం కెసిఆర్ గారు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి భారత దేశానికి నాయకత్వం వహించి దేశ గతిని మార్చాలని కోరారు.

నేడు దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తుందని , రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు , జరుగుతున్న అభివృద్ధి దేశమంతా జరగాలంటే కెసిఆర్ గారి వల్లే సాధ్యమని ఎన్నారైలు తెలిపారు. “దేశ్ కి నేత కెసిఆర్” అంటూ భారీ కెసిఆర్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version