సవాల్ స్వీకరించిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

-

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరించారు. నేడు ఉదయం 11 గంటలకు హనుమాన్ టెంపుల్ వద్దకు రానున్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ మీద రూ. 100 కోట్ల ఫ్లై యాష్ స్కాం ఆరోపణలు చేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అయితే.. ప్రచారం కోసమే పొన్నం మీద ఆరోపణలు చేస్తున్నారని.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి రైస్ మిల్లర్ల నుండి, ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారని తెలిపారు.

Hujurabad MLA Padi Kaushik Reddy accepted the challenge

మా దగ్గర ఆధారాలు ఉన్నాయని.. మంగళవారం ఉదయం చేల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తే ఆధారాలతో నిరూపిస్తూనని  హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితెల ప్రణవ్ సవాల్ విసిరారు. అయితే…హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితెల ప్రణవ్ సవాల్ పై స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్ ప్రజలకు నా నిజాయితీ నిరూపించుకోవడానికి హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తున్నా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version