Group 3: పరీక్షా కేంద్రంలో భార్య.. పిల్లాడి ఆలనాపాలనాలో తండ్రి బిజీగా ఉన్నాడు. ఈ సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఇవాళ తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ తరుణంలలోనే పరీక్షా కేంద్రంలో భార్య.. పిల్లాడి ఆలనాపాలనాలో తండ్రి బిజీగా ఉన్న సంఘటన వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్లోని సిద్ధార్థ పాఠశాలలో పరీక్ష రాయడానికి వెళ్లింది స్వప్న అనే గ్రూప్ 3 అభ్యర్థి. ఇక దగ్గరలోనే షాపు వద్ద 10 నెలల పిల్లాడ్ని జోకొట్టి నిద్రపుచ్చాడు ఆమె భర్త శంకర్. తండ్రిగా, భర్తగా శంకర్ నిర్వర్తించిన బాధ్యతలకు నెట్టింట్లో జోహార్లు చెబుతున్నారు. స్వప్న, శంకర్ల మధ్య ఈ బంధం.. దంపతులకు ఆదర్శమంటూ కామెంట్లు చేస్తున్నారు.