సీఎం కేసీఆర్ కు హుస్నాబాద్ సెంటీమెంట్ గా మారిపోయింది. 2014, 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించారు. ఇందులో భాగంగానే.. అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. అక్టోబర్ 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహిసతారు. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఇక అటు నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్ వేయనున్నారు సీఎం కేసీఆర్.
అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన ఉంటుంది. అక్టోబర్ 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి., హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు. తెల్లారి…అక్టోబర్ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు.17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో సిఎం కేసీఆర్ గారు పాల్గొంటారు. అక్టోబర్ 18 నాడు.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం లో., అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సిఎం పాల్గొంటారు.