హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ తరుణంలోనే హుస్సేన్ సాగర్ నీటిమట్టం భారీగా పెరిగింది. 513.24 మీటర్లకు హుస్సేన్ సాగర్ నీటిమట్టం భారీగా పెరిగింది. ఇక హుస్సేన్ సాగర్ పూర్తి నీటి మట్టం సామర్ధ్యం 513.41 మీటర్లుగా ఉంది.

ఇన్ ఫ్లో 1081 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 789 క్యూసెక్కులుగా ఆమూడు అయింది. నిండు కుండల్లా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు కళకళలాడుతున్నాయి. జంట జలాశయాల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది.
- భారీ వర్షాలు.. పెరిగిన హుస్సేన్ సాగర్ నీటిమట్టం..
- 513.24 మీటర్లకు చేరుకున్న నీటి మట్టం
- హుస్సేన్ సాగర్ పూర్తి నీటి మట్టం సామర్ధ్యం 513.41 మీటర్లు
- ఇన్ ఫ్లో 1081 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 789 క్యూసెక్కులు
- నిండు కుండల్లా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు
- జంట జలాశయాల్లోకి భారీగా చేరుతున్న వరద నీరు