ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. బంగాళాఖాతంలో మరింత అల్పపీడనం బలపడటంతో.. ఈ నెల 27 వరకు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.

మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు చేశారు. ఇక అటు హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ తరుణంలోనే హుస్సేన్ సాగర్ నీటిమట్టం భారీగా పెరిగింది. 513.24 మీటర్లకు హుస్సేన్ సాగర్ నీటిమట్టం భారీగా పెరిగింది. ఇక హుస్సేన్ సాగర్ పూర్తి నీటి మట్టం సామర్ధ్యం 513.41 మీటర్లుగా ఉంది.