Gold Rates: మహిళలకు అలర్ట్. ఇవాళ భారీగా బంగారం ధరలు తగ్గాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు…ఇవాళ కాస్త తగ్గాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1360 తగ్గి, రూ. 1,00,970 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1250 తగ్గి, రూ. 92, 550 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు ఐంది. దీంతో కేజీ వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 1,28,000 గా నమోదు అయింది.