హైదరాబాద్‌కు, తెలంగాణకు మూడు వైపులా సముద్రం ఉన్నది – రేవంత్ రెడ్డి

-

హైదరాబాద్‌కు, తెలంగాణకు మూడు వైపులా సముద్రం ఉన్నది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు పై కొందరూ రాజకీయాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దేశం సురక్షితంగా ఉంటేనే పర్యావరణం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. తమిళనాడులో ఇప్పటికే ఒక నేవీ రాడార్ స్టేషన్ ఉంది. దాని వల్ల అక్కడ ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.

నేవీలో వాడే అన్ని రకాల ఆయుధాలను తయారు చేసే నగరంగా హైదరాబాద్ కు గుర్తింపు లభించిందన్నారు. రక్షణ రంగానికి చెందిన పలు సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయని తెలిపారు. దేశానికి మూడు మూడు వైపులా సముద్రం ఉందని.. వాటిలోప్రయాణించే షిప్ లు, వ్యవస్థలను మానిటరింగ్ చేసే వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ను వికారాబాద్ లో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రూ.2500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ స్టేషన్ ను 2027 వరకు పూర్తి చేయాలని  లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version