హైదరాబాద్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు బెగ్గింగ్ మాఫియాపై కొరఢా ఝుళిపించారు. నిత్యం రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద వాహనదారులను ఇబ్బందులు పెడుతూ భిక్షాటన చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు తాజాగా బెగ్గింగ్ రాకెట్‌ను ఛేదించారు. దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ వద్ద 23 మంది యాచకులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ బెగ్గింగ్ రాకెట్‌ను చేధించాం. మరికొద్ది రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.
వీరితో భిక్షాటన చేయిస్తున్న బెగ్గింగ్ మాఫియా నిర్వాహకుడు అనిల్ పవార్‌ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 23 మంది బిచ్చగాళ్లను రెస్క్యూహోంకు తరలించినట్లు వివరించారు. నిర్వాహకుడిపై భిక్షాటన నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు. బెగ్గింగ్ నిర్వాహకుడు అనిల్ వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులను తీసుకొచ్చి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పరిసర ప్రాంతాల్లో వారితో బెగ్గింగ్ చేయిస్తున్నాడు. యాచకులందరి నుంచి రోజుకు రూ.4,500 నుంచి రూ.6,000 వరకు తీసుకుంటాడు. దీనికి ప్రతిగా ఒక్కో బిచ్చగాడికి రోజుకు రూ.200 కూలిగా చెల్లిస్తున్నాడు.