హైదరాబాద్ లోక్ సభ స్థానానికి కూడా భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్‌కు హైదరాబాద్ టికెట్‌ను ఇచ్చింది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది.
అయితే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం సమావేశాన్ని నిర్వహిస్తూ, స్థానిక నేతల సలహాలు, సూచనలు తీసుకుంటూ, స్థానిక నాయకులు ఏకగ్రీవంగా ఓటేసిన నేతలకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్లు కేటాయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఎన్నో ఏళ్లుగా పార్టీకి విధేయుడిగా ఉంటూ, సీనియర్ నేతగా పేరు పొందిన శ్రీనివాస్ యాదవ్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ లోక్‌సభ టికెట్ కేటాయించారు. మొత్తం 17 స్థానాలకు గాను మూడు ఎస్సీ, రెండు ఎస్టీ స్థానాలు. మిగిలిన 12 స్థానాల్లో సగం స్థానాలు అంటే ఆరింటిని బీసీలకు కేటాయించారు. ఇక ఇటీవలే సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మిగిలిన హైదరాబాద్‌కు కూడా సీటు కేటాయించారు.