ప్రపంచంతో హైదరాబాద్ నగరం పోటీ : సీఎం రేవంత్ రెడ్డి

-

ప్రపంచంతో హైదరాబాద్ నగరం పోటీ పడే విధంగా తయారు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా నానక్  రామ్ గుడాలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్ బిల్డింగును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అందరికంటే ముందు ఘటన స్థలంలో ఉండేది ఫైర్ డిపార్ట్మెంట్ అన్నారు. ప్రజల రక్షణ కోసం అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతారని కొనియాడారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని నగరంలో శాంతిభద్రతలు సరైన విధంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు గత 30 ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగిందని చెప్పారు.

హైదరాబాద్ నగర అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు తాము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2050 యోగ మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నామని వెల్లడించారు. అర్బన్ సెమీ అర్బన్ రూరల్ మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామన్నారు మెట్రో రద్దు కాలేదు ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. ఫార్మాసిటీలు కూడా రద్దు కాలేదని కొత్త ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎలాంటి అపోహలు వద్దు మా ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version